Liquor Shops In Telangana ∣  తెలంగాణలో వైన్ షాపులు ఇకపై రాత్రి 9:30  ( Wine Shops In Telangana Till 9.30 PM ) వరకు తెరిచే ఉంటాయి. గురువారం రాత్రి నుంచే ఈ కొత్త టైమింగ్ అమలులోకి వస్తుంది అని ఎక్సైజ్ శాఖ తెలిపింది. నాటు సారా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ( Telangana Excise Minister V Srinivas ) .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also : Free Tests: హైదరాబాద్ లో ఉచిత కోవిడ్ నిర్దారణ పరీక్షల సెంటర్లు ఇవే


 తెలంగాణలో కల్తీ మద్యం  అమ్మకాన్ని పూర్తిగా అరికడతామని... ముఖ్యంగా గుడుంబా తయారీ చేసేవారికిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై పీడి యాక్డు ( PD Act )  ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అదే సమయంలో కొత్తగా మార్చిన వైన్షాపు టైమింగ్ గురువారం రాత్రి నుంచే అమలు చేస్తామని.. ప్రభుత్వ కొత్త జీవో ( Telangana Government GO On Excise ) ప్రకారం ఈ సమయాన్ని పెంచామని తెలిపారు. 


సీఎం కేసిఆర్ ఇంతకు ముందే తెలిపిన విధంగా గుడుంబా రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం అని మంత్రి తెలిపారు. కల్తీ మద్యం తయారీదారుల గురించి తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలను కోరాలు మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ . Also Read : UPI Payments : యూపీఐ పేమెంట్స్ సరికొత్త రికార్డు